భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్లో ఫెర్టిలైజర్, ఫెస్టిసైడ్, విత్తన వ్యాపారులతో డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ రమేశ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన విత్తనాలు, మందులు అమ్మితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలపై ఇప్పటికే నిఘా పెట్టిందని… రాష్ట్ర ఐజీ కూడా నకిలీ విత్తనాల వ్యాపారంపై సీరియస్గా ఉన్నారని… నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ సీజన్ కావడంతో నకిలీ విత్తనాల అమ్మకాలు జరిపే అవకాశాలు ఉన్నాయని… బయట ప్రాంతాల నుంచి వచ్చి స్థానికంగా అమ్మకాలు జరిపి రైతులను మోసం చేయాలని చూసే నకిలీ వ్యాపారుల గురించి సమాచారం ఇవ్వాలని వ్యాపారులకు సూచించారు.