భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన ఓ యువకుని కరోనా సోకగా.. మూడు రోజుల క్రితం భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో వైద్యం పొందుతూ గురువారం సాయంత్రం మరణించాడు. అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కుటుంబసభ్యులెవరూ ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వైద్యులే 'ఆ నలుగురు'గా మారి అంత్యక్రియలు నిర్వహించారు.
ఆసుపత్రి వైద్యులే 'ఆ నలుగురు'గా మారి అంత్యక్రియలు - at bhadrachalam doctors did funeral to corona patient
వైద్యో నారాయణో హరిః అన్నారు పెద్దలు. కనిపించే దేవుడు డాక్టర్ అని చాలా మంది విశ్వసిస్తారు. అది నిజమని నిరూపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యులు. కరోనాతో మరణించిన వ్యక్తిని అనాథగా వదిలేయలేక.. వారే అంత్యక్రియలు నిర్వహించారు.
ఆసుపత్రి వైద్యులే 'ఆ నలుగురు'గా మారి అంత్యక్రియలు
ప్రభుత్వాసుపత్రి నుంచి మృతదేహాన్ని మోసుకొచ్చి వాహనంలో ఎక్కించి.. ఊరి చివరన ఉన్న శ్మశానవాటికలో దహన సంస్కారాలు చేయించారు. అంత్యక్రియల్లో ఆసుపత్రి సూపరింటెండెంట్, డాకర్లు కృష్ణ ప్రసాద్, సునీల్, ఆసుపత్రి సిబ్బంది శివ, భాస్కర్ పాల్గొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు చేసిన మంచి పనికి స్థానికులంతా సామాజిక మాధ్యమాల్లో వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఇవీచూడండి:భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్
Last Updated : Aug 7, 2020, 7:06 AM IST