భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో గత 10 రోజులుగా ఆలయ సిబ్బంది యాచకులకు, పేదలకు భోజనం ప్యాకెట్లను అందిస్తోంది. కరోనా వ్యాప్తికి ముందు భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయంలోని నిత్య అన్నదాన సత్రంలో ప్రతి రోజు 300 మందికి అన్నదానం చేసేవారు.
యాచకులకు, పేదలకు...
సామూహికంగా భోజనం చేయడం నిషిద్ధం కావడం వల్ల సుమారు 40 రోజుల క్రితం అన్నదాన సత్రాన్ని మూసివేశారు. భద్రాద్రిలో 45 ఏళ్ల క్రితం మొదటిసారిగా అన్నదానాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచి నిత్యం భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మొదటిసారి అన్నదాన సత్రాన్ని మూసివేశారు. పనులు లేక ఆకలికి ఇబ్బందులు పడుతున్న పేదలకు, ఆకలితో అలమటిస్తున్న యాచకులకు అన్న ప్రసాద వితరణ చేయాలని దేవస్థానం నిర్ణయించింది. గత 10 రోజుల నుంచి ప్రతి రోజు అన్నప్రసాదాన్ని తయారుచేసి భోజనం ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. ప్రతిరోజు 300 నుంచి 400 మందికి అందిస్తున్నారు.
ఇవీ చూడండి : 'వలస కూలీల ప్రయాణ ఖర్చులు ప్రభుత్వమే భరించాలి'