ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు ప్రజలు పొందడంలో పోలీసు వ్యవస్థ తమ వంతు పాత్ర పోషిస్తుందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో... మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల పోలీసు అధికారులతో డీజీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లా పోలీసు అధికారులతో డీజీపీ సమీక్ష - పోలీసు వ్యవస్థ పనితీరుపై డీజీపీ సమీక్ష
భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగూడెంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు వ్యవస్థ మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు పలు అంశాలను చర్చించారు.
జిల్లా పోలీసు అధికారులతో డీజీపీ సమీక్ష
పట్టణాలు, గ్రామాల్లో అమలవుతోన్న పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలను గూర్చి చర్చించారు. పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేయడానికి అవసరమైన చర్యలు, నేర శాతాన్ని తగ్గించేందుకు అవసరమైన ప్రణాళికలు తదితర అంశాలను అధికారులతో చర్చించినట్లు డీజీపీ వెల్లడించారు.