తెలంగాణ

telangana

ETV Bharat / state

మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: డీజీపీ - కొత్తగూడెంలో ఫైరింగ్ రేంజ్​ను ప్రారంభించిన డీజీపీ

తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రధాన కర్తవ్యమని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఆయన... కొత్తగూడెంలో పరేడ్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్​ను ప్రారంభించారు.

dgp mahendar reddy inaugurate police parade ground and firing range in kothagudem
మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: డీజీపీ

By

Published : Dec 23, 2020, 4:27 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. కొత్తగూడెంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్​, ఫైరింగ్ రేంజ్​ను ప్రారంభించిన అనంతరం... గుండాల స్టేషన్​ను సందర్శించారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రధాన కర్తవ్యమన్నారు.

పోలీసు నియామకాల్లో గ్రామీణ యువతకు ప్రాధాన్యత కల్పించేందుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు మహేందర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ సూచనల మేరకు రాష్ట్రాన్ని శాంతియుత ప్రాంతంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి:'జనవరి 26న దిల్లీ వీధుల్లో రైతుల పరేడ్'

ABOUT THE AUTHOR

...view details