మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరిలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు తరలి వచ్చారు. స్నానమాచరించిన అనంతరం ఆలయంలోని శివపార్వతులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శివునికి పంచామృతాలతో, నదీ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో శివాజీ తెలిపారు. ఈరోజు రాత్రి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఆలయాల్లో శివనామస్మరణలు.. గోదావరిలో పుణ్యస్నానాలు
మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలు శోభను సంతరించుకున్నాయి. తెల్లవారు జామునుంచే భక్తులు ఆలయాలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలుఆచరిస్తున్నారు.
శివ నామస్మరణతో ప్రాంగణాలు.. గోదావరిలో పుణ్యస్నానాలు