భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని కృష్ణా జిల్లా భక్తులు పాదయాత్రతో వచ్చి దర్శించుకున్నారు. ఈ నెల 19 నుంచి కృష్ణా జిల్లాలోని గంపలగూడెం మండలం సత్యాలపాడు గ్రామానికి చెందిన సుమారు 150 మంది భక్తులు పాదయాత్ర చేపట్టారు. ఈరోజు ఉదయం భద్రాద్రికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు.
భద్రాద్రి రామయ్య చెంతకు పాదయాత్రగా 150 మంది.! - భద్రాద్రి రామయ్య వార్తలు
భద్రాద్రి రామయ్యను కృష్ణా జిల్లాకు చెందిన సుమారు 150 మంది భక్తులు పాదయాత్రతో వచ్చి దర్శించుకున్నారు. ఈ నెల 19న ప్రారంభమై ఇవాళ ఉదయం భద్రాద్రికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి దర్శనం కల్పించారు.
పాదయాత్రతో భద్రాద్రి రామయ్య చెంతకు 150 మంది భక్తులు
గ్రామానికి చెందిన రామ్మోహన్రావు 18 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా తన తల్లిదండ్రులతో కలిసి పాదయాత్ర చేసి స్వామివారిని దర్శించుకుంటున్నట్లు తెలిపారు. భద్రాద్రి రామయ్య సన్నిధికి వచ్చిన పాదయాత్ర భక్తులకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శనం కల్పించారు.
ఇదీ చూడండి: ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు