Devotees Rush in Bhadradri: భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో సీతారాముల దర్శనానికి తరలివచ్చారు. రద్దీతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి.
రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తజనం పంచామృతాలతో అభిషేకం
ఆలయంలో భక్తుల రద్దీ పెరగడంతో ప్రత్యేక దర్శనానికి గంట, ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. ఇవాళ పునర్వసు నక్షత్రం సందర్భంగా లక్ష్మణ సమేత సీతారాములకు అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. బంగారు పుష్పాలతో అర్చన చేశారు.
ఇదీ చదవండి:ఈనెల 28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ.. అనంతరం భక్తులకు అనుమతి