devotees crowd in bhadrachalam: భద్రాచలం భక్తుల రాకతో సందడిగా మారింది. వరుస సెలవులు రావడంతో ఒక్కసారిగా భద్రాద్రికి రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతాలు కిక్కిరిసి పోయాయి. భక్తులు భారీగా స్వామివారి దర్శనానికి కదిలి రావడంతో క్యూలైన్లి భక్తులతో నిండిపోయాయి.
devotees crowd in bhadrachalam: భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ - భద్రాచలంలో పెరిగిన భక్తుల రద్దీ
devotees crowd in bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజూము నుంచే పెద్దఎత్తున స్వామివారి దర్శనానికి తరలివచ్చారు.
భద్రాచలంలో భక్తుల రద్దీ
devotees in bhadradri: ముఖ్యంగా శనివారం కావడం వల్ల ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు బంగారు తులసీదళాలతో అర్చన చేశారు. ప్రతి రోజు జరిగే నిత్య కళ్యాణ వేడుకలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జిలకర్ర బెల్లం, మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుకలు చూసి తిలకించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.