భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే సకుటుంబ సమేతంగా విచ్చేసి మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు సంతోషంగా జరుపుకుంటున్నారు. పట్టణంలోని ఎంజీ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు చేసి.. సామూహిక వ్రతాలను నిర్వహించారు.
కొత్తగూడెంలో సందడిగా మారిన శివాలయాలు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శివాలయాలు ఉదయం నుంచే భక్తులతో సందడిగా మారాయి. పట్టణంలోని పలు శివాలయాల్లో భక్తులు హాజరై పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివనామస్మరణతో వీధులన్నీ మార్మోగాయి.
కొత్తగూడెంలో సందడిగా మారిన శివాలయాలు
శివ లింగాలకు భక్తులు పాలాభిషేకాలు, కుంకుమార్చనలు జరిపించారు. శివాలయాలతోపాటు పట్టణంలోని వివిధ దేవాలయాలు కూడా భక్తుల రాకతో సందడిగా మారాయి. స్వాములకు అభిషేకాలు నిర్వహించిన భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.