భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీతాయారు అమ్మవారు రోజుకు ఒక రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారు ధనలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు.
భద్రాద్రిలో కనులవిందుగా దేవి శరన్నవరాత్రులు - Bhadradri Temple Latest News
భద్రాద్రి రామయ్య సన్నిధిలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా అమ్మవారు ఈరోజు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

భద్రాద్రిలో కనులవిందుగా దేవి శరన్నవరాత్రులు
ఉత్సవాల సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ఉదయం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మహానివేదన చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. సాయంత్రం అమ్మవారి ఆలయం ఎదురుగా రామయ్య తండ్రికి దర్బార్ సేవ జరపనున్నారు. అనంతరం మహా మంత్రపుష్పం వేడుక జరగనుంది. ఈ ఉత్సవాల్లో అమ్మవారు రేపు ధాన్యలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.