భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో లక్ష్మీ తాయారు అమ్మవారు అష్టలక్ష్ములుగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఐదవ రోజైన బుధవారం లక్ష్మీ తాయారు అమ్మవారు... ధాన్యలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తున్నారు.
భద్రాద్రిలో ధాన్యలక్ష్మి అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం - Bhadradri Kottagudem District Latest News
భద్రాద్రిలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారు ధాన్యలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![భద్రాద్రిలో ధాన్యలక్ష్మి అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం devi navratri celebrations in bhadrachalam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9257188-598-9257188-1603270220433.jpg)
భద్రాద్రిలో ధాన్యలక్ష్మి అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం
అమ్మవారిని దర్శించుకోవడం వల్ల పాడి పంటలు వృద్ధి చెందుతాయని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. లక్ష్మీ తాయారు అమ్మవారు గురువారం విజయలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
- ఇదీ చూడండి:బాసరలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు