Deputy CM Bhatti Vikramarka Visit Bhadradri Thermal Power Plant : గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు కోసం భారీగా అప్పులు చేసిందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. విద్యుత్ కొనుగోలు కింద రూ.59,580 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచిందని ఆరోపించారు. ఇలాంటి సమయంలో కొత్త ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా, ముందుచూపుతో అడుగులు వేయాల్సి ఉందన్నారు. భద్రాద్రిలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్(Bhadradri Thermal Plant)ను ఆయన సందర్శించారు. అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం సమావేశంలో మాట్లాడారు.
Bhadradri Thermal Power Plant :ఈ సందర్భంగాప్రతి శాఖలోని పరిస్థితులను సమీక్ష చేస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖను పీకల్లోతు అప్పుల్లో ముంచి వెళ్లిందని ఆరోపించారు. విద్యుత్ శాఖలోని సమస్యలను క్రమంగా అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు. ప్రజలు, ఉద్యోగులు కలిసి పని చేస్తేనే సమస్యలను అధిగమించలగమని వివరించారు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్ విషయంలో అనేక సమస్యలు ఉన్నాయన్న ఆయన, భద్రాద్రి ప్లాంట్‌కు ముడి సరకు, పర్యావరణ సమస్యలు ఉన్నాయని చెప్పారు.
తెలంగాణ విద్యుత్ శాఖ అప్పులు రూ. 81,516 కోట్లు : భట్టి విక్రమార్క
Bhatti Vikramarka Fires on BRS :గత ప్రభుత్వం చేసిన విద్యుత్ అప్పులను చూస్తుంటే రాబోయే తరాలను కూడా తాకట్టు పెట్టారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. గత ప్రభుత్వ విద్యుత్ లెక్కలను పరిశీలిస్తే ఆందోళనకరంగా ఉందని, డిస్కం, ట్రాన్స్‌కో, జెన్కో సంస్థలకు గత పదేళ్లలో రూ.81,516 కోట్లు రుణంగా తీసుకుందని చెప్పారు. ప్రభుత్వం నుంచి డిస్కంలకు చెల్లించే బకాయిలు రూ.28,842 కోట్లుగా ఉన్నాయని అన్నారు. దీంతో మొత్తం రూ.1,10,358 కోట్లు అప్పుగా ఉందన్నారు.