Bhadrachalam Temple: దేశంలో ఒమిక్రాన్ రోజురోజుకు పెరుగుతున్న నందున ప్రజలంతా ఒకచోట గుమికూడి ఉండరాదని, ర్యాలీలు సభలు నిర్వహించి రాదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈనెల 12, 13న జరగనున్న తెప్పోత్సవం, ఉత్తరద్వార దర్శనాలకు భక్తుల అనుమతిని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఈనెల 12న తెప్పోత్సవం, 13న ఉత్తరద్వార దర్శనం.. వేద పండితులు, అర్చకుల సమక్షంలో మాత్రమే నిర్వహిస్తామని తెలిపారు.
Bhadrachalam Temple: ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భక్తులకు అనుమతి నిరాకరణ - Mukkoti Ekadashi celebrations
Bhadrachalam Temple: భద్రాచలం రాములోరి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భక్తులకు అనుమతి లేదని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో భాగంగా ఆన్‌లైన్‌లో అమ్మిన టికెట్ల డబ్బులు భక్తులకు తిరిగి చెల్లించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతునందున భక్తులకు అనుమతి నిరాకరించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో అమ్మిన టికెట్లకు సంబంధించిన నగదు తిరిగి భక్తులకు చెల్లిస్తామని అన్నారు. ప్రజలు, భక్తులందరూ సహకరించి తెప్పోత్సవం ముక్కోటి ఏకాదశి వేడుకలకు హాజరు కావద్దని అన్నారు. ఇప్పటి వరకు గోదావరి నది వద్ద జరుగుతున్న హంస వాహనం ఏర్పాట్ల పనులను నిలిపివేశారు. రేపటి నుంచి జరగనున్న అన్ని ఉత్సవాలు యథాతథంగా సాంప్రదాయబద్ధంగానే ఆలయం లోపల నిర్వహిస్తామని అన్నారు.
ఇదీ చదవండి: