భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం రెండు రోజుల నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. 61.7 అడుగుల నుంచి 53 అడుగులకు చేరింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు గోదావరి నీటిమట్టం 47.3 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు.
గోదావరికి తగ్గిన వరద.. ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ - భద్రాచలం వద్ద తగ్గిన వరద
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు.
గోదావరికి తగ్గిన వరద.. ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
వరద ప్రవాహం తగ్గడం వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు కొంత వరకు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడిప్పుడే భద్రాచలం పరిసరాల్లో ప్రధాన రహదారిపై ఉన్న వరద నీరు తగ్గుతూ వస్తోంది. ఏజెన్సీ మండలాలైన చర్ల, దుమ్ముగూడెం మండలాలకు రాకపోకలు కొనసాగడం లేదు. విలీన మండలాల్లో కూనవరం, వీఆర్పురం, చింతూరు, కుక్కునూరు మండలాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.