భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం బోడయికుంట గ్రామానికి చెందిన ఏడూళ్ల లక్ష్మీనర్సు (45) అనే రైతు అనారోగ్యంతో బుధవారం రోజున ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బోడయికుంఠ- మర్కోడు గ్రామాల మధ్య ఉన్న చింతలపడి వాగు ప్రవహిస్తుంది.
గిరిజనుల దుస్థితి... మృతదేహాన్ని జోలెలో తరలింపు - tribals transport problems
గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కాదు. అత్యవర పరిస్థితుల్లో తాముంటున్న గ్రామాన్ని దాటి పోవాలంటే వాళ్లు పెద్ద సాహసాలే చేయాలి. గర్భంతో ఉన్న మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లాలన్నా... అదే ఆస్పత్రి నుంచి ఓ మృతదేహాన్ని ఊళ్లోకి తీసుకురావాలన్నా... జోలె కట్టాల్సిందే...
dead body moved to village in sling in badradri district
వాగుపై వంతెన లేకపోవటం వల్ల లక్ష్మీనర్సు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కర్రకు జోలె కట్టి ఇంటికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి వాగుపై వంతెన నిర్మించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.