తెలంగాణ

telangana

ETV Bharat / state

Last Rites Rituals: తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించిన తనయ - తండ్రికి కొరివి పెట్టిన తనయ

కుమారుడు తల కొరివి పెడితే పున్నామ స్వర్గానికి చేరుతారనేది ప్రధాన నానుడి. మరి మగబిడ్డల్లేని తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వారసుడుల్లేని తండ్రికి.. కూతురే కుమారుడిలా మారి తండ్రికి అంత్యక్రియలు (Last Rites Rituals) నిర్వహించింది. ఈ ఘటన ఆళ్లపల్లి మండలంలో చోటు చేసుకుంది.

Last Rites Rituals
Last Rites Rituals

By

Published : Sep 30, 2021, 10:44 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం కేంద్రంలో తండ్రికి.. కూతురు తలకొరివి (Last Rites Rituals) పెట్టింది. మండల కేంద్రానికి చెందిన నాగేశ్వరరావు కుటుంబంతో కలిసి స్థానికంగా నివాసముంటున్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వ్యవసాయం చేసుకుంటూ ముగ్గురు ఆడపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు ఆ తండ్రి. ఎన్ని ఇబ్బందులెదురైనా కష్టం వారి దగ్గరకు చేరకుండా చూసుకున్నాడు. భార్యా పిల్లలతో ఉన్నదాంట్లో ఆనందంగా బతికాడు. కానీ.. కాలం కన్నెర్ర చేసింది. ఇటీవల ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న నాగేశ్వరరావు... చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.

మృతునికి ముగ్గురు కుమార్తెలే. కుమారులు లేకపోవడంతో చిన్న కుమార్తె సుమతి తండ్రి చితికి నిప్పంటించింది. అంతిమ యాత్ర (Last Rites Rituals) నిర్వహించి దహన సంస్కారాలు పూర్తి చేసింది. కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని... వారికి ప్రభుత్వం సాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:మరణించిన 14 రోజులకు అంత్యక్రియలు- ఆత్మ ఇప్పుడే వీడిందని...

ABOUT THE AUTHOR

...view details