తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్​ తీగల నీడలో భయంతో ఇంకెన్నాళ్లు...! - CURRENT TEEGALU DAMAGED

ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో ఇళ్లు కట్టుకున్న పేదవారు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఎప్పుడు ఏ కరెంటు తీగొచ్చి ఎవరింటి మీద పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. బంగ్లాలున్నా... పైకెక్కటానికి భయపడుతున్నారు. భద్రాచలం అశోక్​నగర్​లోని కొత్త కాలనీ వాసుల గోడు ఇది.

బిక్కుబిక్కుమంటూ జీవనం...

By

Published : Apr 3, 2019, 7:46 PM IST

బిక్కుబిక్కుమంటూ జీవనం...
భద్రాచలంలోని అశోక్ నగర్​లో పెద్ద ప్రమాదం తప్పింది. 33 కేవీ హైటెన్షన్ తీగలు ఒక్కసారిగా ఇళ్ళపై పడటంతో స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఎవరికీ అపాయం జరగనందున అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలో ఈ విద్యుత్ తీగల బారినపడి చాలామంది ప్రాణాలు కోల్పోయారని కాలనీవాసులు వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా... పట్టించుకోవట్లేదని ఆరోపించారు.

సిబ్బంది నిర్బంధం...

మరమ్మతులు చేసేందుకు వచ్చిన విద్యుత్ సిబ్బందిని స్థానికులు నిర్బంధించారు. నివాసాలపైనుంచి విద్యుత్ లైన్లు పూర్తిగా తొలగించాలని ఆందోళన నిర్వహించారు. తాము పైఅధికారుల ఆదేశాల ప్రకారమే నడుచుకుంటామని సిబ్బంది తెలిపారు.

పూర్తిగా తొలగించాలి...

ప్రమాదాలు జరిగిన తర్వాత రెండు రోజులు హడావిడి చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. శాశ్వత పరిష్కారం కల్పించే వరకు ఆందోళన కొనసాగిస్తామని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి:సీఎంను ప్రకటించిన కౌన్సిలర్​... అవాక్కైన మంత్రి..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details