తెలంగాణ

telangana

By

Published : Jan 25, 2021, 7:41 PM IST

ETV Bharat / state

అటవీ చట్టాలను ప్రభుత్వాలు కాలరాస్తునాయి: బృందా కారత్​

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సీపీఎం ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

cpm protest rally for podu lands regulerization in bhadradri kothagudem
అటవీ చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తునాయి: సీపీఎం

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్​ చేస్తూ... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సీపీఎం భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించిన అనతరం కలెక్టరేట్​ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీఎం జాతీయ నాయకురాలు బృందా కారత్, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.


ఐదో షెడ్యూల్​ ప్రకారం గిరిజన ప్రాంతాల్లో అటవీ సంపదపై గిరిజనులకు మాత్రమే ఉన్న హక్కులను కాలరాస్తున్నారని బృందా కారత్​ విమర్శించారు. పోడు భూముల నుంచి వెళ్లగొట్టి... అటవీ శాఖతో కలిసి షెడ్యూల్​ ఏరియాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధ్వంసం చేస్తున్నాయని ఆరోపించారు. ఎర్రజెండ పోరాటంతో వచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా... అసెంబ్లీని సీఎం కేసీఆర్​ తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు.

ఇదీ చూడండి:'పురపాలికల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు'

ABOUT THE AUTHOR

...view details