పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి ముప్పు తప్పదని సీపీఎం నాయకులు బాల నరసారెడ్డి హెచ్చరించారు. 2007 జనవరి 29వ తేదీన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా భద్రాచలంలో జరిగిన భారీ ఆందోళనను స్మరించుకుంటూ సమావేశం నిర్వహించారు.
ఈ ఆందోళనలో పోలీసుల జరిపిన కాల్పుల్లో చాలా మంది గాయపడగా.. అనేక మందిపై కేసులు నమోదు చేశారని బాల నరసారెడ్డి తెలిపారు. భద్రాద్రికి పొంచి ఉన్న ముప్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగి 14 ఏళ్లు పూర్తయిందని.. పోలవరం ప్రాజెక్టు వ్యతిరేకంగా 14 ఏళ్ల నుంచి పోరాడుతున్నామని గుర్తు చేశారు.