తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయాలి: సీపీఎం - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్త

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఎం నాయకులు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్రశ్రీలో చేర్చాలంటూ డిమాండ్​ చేశారు.

cpm leader protest in front of govt hospital in bhadradri kothagudem
ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయాలి: సీపీఎం

By

Published : Jul 18, 2020, 3:26 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్​ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఎం నాయకులు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్​ పరీక్షలు నిర్వహించాలంటూ నినాదాలు చేశారు.

పేదలందరికీ ప్రైవేట్ హాస్పటల్లో ఉచితంగా కరోనావైద్యం చేయాలని వారు కోరారు. దీక్షలో సీపీఎం జిల్లా అధ్యక్షులు ఏజే రమేశ్​, పట్టణ నాయకులు బాలనరసారెడ్డి, వెంకటరెడ్డి, గడ్డంస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details