పోడుదారులపై అటవీశాఖ దాడులు ఆపాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు మధు డిమాండ్ చేశారు. పోడు భూమిని నమ్ముకొని ఉన్న సాగు దారులకు హక్కులు కల్పించాలని కోరారు. అధికారుల తీరును నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో భారీ ప్రదర్శన చేపట్టారు.
'దాడులు ఆపాలి.. సాగుదారులకు హక్కులు కల్పించాలి' - Bhadradri Kottagudem District Latest News
పోడుదారులపై అటవీశాఖ దాడులు ఆపాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత మధు డిమాండ్ చేశారు. భూములు లాక్కుని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. జూలూరుపాడులో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.
అటవీశాఖ దాడులు ఆపాలని సీపీఐ ఎంఎల్ నిరసన
తెరాస ప్రభుత్వం హరితహారం పేరుతో పోడు భూములు లాక్కోవడం అమానుషమని న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత మధు ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న రైతులపై అటవీ అధికారులతో సర్కార్ దాడులు చేస్తోందని విమర్శించారు. తక్షణమే అలాంటి చర్యలు ఉపక్రమించుకోవాలని డిమాండ్ చేశారు.
భూములు లాక్కుని ఖనిజ సంపద కోసం కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఎన్నికల ముందు పోడు రైతులకు హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడేమో దాడులు చేస్తోంది.
-మధు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు
ఇదీ చూడండి:'క్షమాపణ చెప్పాలి.. లేదంటే ప్రజాక్షేత్రంలో తిరగనివ్వం'