రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా నిరుపేదలందరికీ రూ.1500 ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సీపీఐ నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. లాక్డౌన్ వల్ల చాలా మంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ నాయకులు వినతిపత్రంలో పేర్కొన్నారు. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు రాలేదని తెలిపారు.
'పేదలందరికీ ప్రభుత్వం నగదు సాయం చేయాలి' - corona effect
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సీపీఐ నాయకులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. రేషన్‌కార్డుతో సంబంధంలేకుండానే ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బియ్యం, నగదు పేదలందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
'పేదలందరికీ ప్రభుత్వం నగదు సాయం చేయాలి'
కార్డులు లేక ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బియ్యం, నగదు సాయం అందట్లేదని పేదలు పడుతున్న ఆవేదనను పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని కోరారు. అర్హులైన అందరికీ రేషన్‌కార్డులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దారును సీపీఐ నాయకులు కోరారు.