తెలంగాణ

telangana

ETV Bharat / state

'పండుగ రోజు నిరసన చేయాల్సి రావడం దురదృష్టకరం'

రైతులు పండుగ రోజు కూడా నిరసన చేయాల్సి రావడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. రైతులు మూడు నెలలుగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

cpi cpi ml protest against news farming bill in bhadradri kothagudem
'పండుగ రోజు నిరసన చేయాల్సి రావడం దురదృష్టకరం'

By

Published : Jan 13, 2021, 6:18 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కేంద్రం ప్రవేశపెట్టిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పండుగ రోజు నిరసన చేయాల్సి రావడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.

రైతులు మూడు నెలలుగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల పేరిట కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: 'దేశంలో 11 నగరాలకు చేరిన కొవాగ్జిన్'

ABOUT THE AUTHOR

...view details