కొవిడ్ నిర్ధారణ పరీక్ష కోసం వచ్చి క్యూలో నిలబడ్డ ఓ వ్యక్తి.. ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం పీహెచ్సీలో చోటుచేసుకుంది. మృతుడి నుంచి నమూనాలు సేకరించిన వైద్య బృందం.. అతడికి కొవిడ్ సోకినట్లు గుర్తించారు.
విషయం తెలుసుకున్న సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు.. ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. టెస్ట్ కోసం.. బాధితుడు రెండు రోజులుగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా.. సిబ్బంది పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి రోజు 200 మంది జనాభా వస్తుంటే.. కేవలం 25 మందికి మాత్రమే పరీక్షలు జరుపుతున్నారంటూ మండి పడ్డారు.