భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో కరోనాతో మృతి చెందిన ఇద్దరికి పురపాలక ఛైర్మన్ వెంకటేశ్వర్లు, వార్డు కౌన్సిలర్ నవీన్ ఆధ్వర్యంలో అంతక్రియలు నిర్వహించారు. వైద్యుల సూచనలతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అంత్యక్రియలను పూర్తి చేశారు. ప్రజాప్రతినిధుల బాధ్యతాయుత చర్య పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు
కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సైతం భయపడుతున్నారు. అలాంటి తరుణంలో కొందరు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మాత్రం కరోనా బాధితుల అంత్యక్రియలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు
ఇదీచూడండి.. పరీక్షల వాయిదాకు నేడు కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు
TAGGED:
ఇల్లందు పట్టణం తాజా వార్తలు