తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాచలంలో కరోనా కట్టడి చర్యలు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కరోనా కట్టడిలో భాగంగం లాక్​డౌన్​ కొనసాగుతోంది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఐటీసీ పీఎస్​పీడీ సౌజన్యంతో నగరంలో ఇవాళ్టి నుంచి సోడియం హైపో ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు.

corona virus preventive actions in bhadrachalam
భద్రాచలంలో కరోనా కట్టడి చర్యలు

By

Published : Apr 4, 2020, 8:47 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో లాక్​డౌన్​ కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్​గఢ్​, ఒడిశా, ఏపీ నుంచే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వాహన చోదకులు ఎవరైనా అనారోగ్య లక్షణాలు కనపిస్తే అనుమతించడం లేదు. నిత్యావసర వస్తువులు మినహా మిగతా వాహనాలను అనుమతించడం లేదు.

భద్రాచలం పట్టణంలో నేటి నుంచి ఐటీసీ పీఎస్​పీడీ సౌజన్యంతో పలు కాలనీల్లో సోడియం హైపో ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. కార్యక్రమాన్ని ఐటీసీ ప్రతినిధి చెంగల్ రావు, భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర, పట్టణ ప్రముఖులు పాకాల దుర్గాప్రసాద్, పంచాయితీ రాజ్​ ఈవో శ్రీనివాస రావు తదితరులు ప్రారంభించారు.

భద్రాచలంలో కరోనా కట్టడి చర్యలు

ఇదీ చూడండి :కరోనా మృతులపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details