తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజలకు కరోనాపై సంపూర్ణ అవగాహన కల్పించండి' - corona masks distribution in Yellandu

మే 7 వరకు లాక్​డౌన్​ పొడిగించడం నేపథ్యంలో కరోనా నివారణపై ప్రజాప్రతినిధులంతా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీ కవిత సూచించారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు పురపాలికలో రెండో విడత మాస్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

corona masks distribution at Yellandu
ఇల్లందులో మాస్కుల పంపిణీ

By

Published : Apr 20, 2020, 1:28 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని 24 వార్డుల్లో కరోనా కట్టడిపై కౌన్సిలర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. పట్టణంలో రెండో విడత మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎంపీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని 24 వార్డులకు చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మే 7 వరకు లాక్​డౌన్​ పొడిగించడం వల్ల ప్రజలందరికి కరోనా వ్యాప్తి కట్టడిపై ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఎంపీ కవిత సూచించారు.

ABOUT THE AUTHOR

...view details