విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు కరోనా నేపథ్యంలో ఉత్పత్తి తగ్గించాయి. లాభాలతో కళకళలాడే సింగరేణిపై కరోనా కాటు వేస్తోంది. సింగరేణి వ్యాప్తంగా బొగ్గు నిల్వలు పెరుగుతున్నాయి. మరోవైపు కొనుగోలు రవాణా తగ్గడంతో పాటు నాణ్యతాపరమైన ఇతర సమస్యలు కూడా వెంటాడుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియాలో గత నాలుగు నెలల్లో జేకే ఉపరితల గని, సీఎస్పీ ఆవరణలోని వివిధ ప్రదేశాలలో ఉన్న బొగ్గు నిల్వలు సుమారు 7.70 లక్షల టన్నులకు పైగా ఉన్నాయని జీఎం సత్యనారాయణ తెలిపారు.