భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రెండో కరోనా కేసు నమోదయింది. వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లిన సింగరేణి కార్మికుడికి మొదటగా వైరస్ సోకగా.. తాజాగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌కు డయాలసిస్ కోసం వెళ్లి వచ్చిన 23 సంవత్సరాల యువతికి కరోనా నిర్ధరణయింది. ఆమెను చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో మృతి చెందడం వల్ల పట్టణ ప్రజలతోపాటు అధికారులు ఆందోళనకు గురయ్యారు. వైద్య సిబ్బంది ప్రైమరీ కాంటాక్ట్స్ కనుక్కునే పనిలో పడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విజృంభిస్తోన్న కొవిడ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి నుంచి కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి. కానీ తాజాగా సింగరేణి ప్రాంతాల్లో కొవిడ్ విజృంభిస్తోంది. ఇల్లందులో రెండో కరోనా కేసు నమోదు కావడం, వైరస్ సోకిన యువతి మృతి చెందడం వల్ల ప్రజలు ఆందోనళకు గురవుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విజృంభిస్తోన్న కొవిడ్
ఇప్పటికే ప్రైమరీ కాంటాక్ట్‌గా 10 మందిని గుర్తించారు. రెండు కేసుల్లోనూ హైదరాబాద్‌కు వైద్యానికి వెళ్లిన వారికే వైరస్ సోకడం ఆందోళన కలిస్తోన్న అంశం. కరోనాతో మృతి చెందిన యువతి అంత్యక్రియలు నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చూడండి:పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ