తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామ గ్రామాన కరోనా అవగాహన కార్యక్రమాలు - ఇల్లందు మండలంలోని గ్రామాల్లో కరోనా అవగాహన కార్యక్రమాలు

గ్రామాల్లో కరోనా వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాలు కల్పించడం ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు రొంపెడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని కొమ్ముగూడెంలో ఆశా కార్యకర్తలతో కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

corona awareness programs
గ్రామ గ్రామాన కరోనా అవగాహన కార్యక్రమాలు

By

Published : Mar 17, 2020, 7:58 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమ్ముగూడెం, రొంపెడు గ్రామాలలో కరోనా వ్యాధిపై ఆశా కార్యకర్తలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వైరస్​ వ్యాప్తి పట్ల గ్రామాల్లో అవగాహన కల్పించడం ద్వారా ప్రజల అనుమానాలు నివృత్తి చేశారు.

వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల కరోనా వ్యాపించకుండా నివారించవచ్చని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్లొద్దని.. వదంతులు నమ్మొద్దని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని వైద్యులు తెలిపారు.

గ్రామ గ్రామాన కరోనా అవగాహన కార్యక్రమాలు

ఇదీ చూడండి:రైతు రుణమాఫీకి గ్రీన్​ సిగ్నల్​.. మార్గదర్శకాలు విడుదల

ABOUT THE AUTHOR

...view details