భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు. దేశంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగి ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటూ 12 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉందని చెబుతున్న ప్రభుత్వం కరోనా చికిత్స ఖర్చులు భరించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక వార్డు శిబిరాలు ఏర్పాటు చేయాలని వారు అన్నారు.
'ధనిక రాష్ట్రంలో వైద్య ఖర్చులు భరించలేరా': కాంగ్రెస్ నేతల ప్రశ్న - latest news of bhadradri kothagudem
కరోనా చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సమావేశమైన వారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారు.
'ధనిక రాష్ట్రంలో వైద్య ఖర్చులు భరించలేరా': కాంగ్రెస్ నేతల ప్రశ్న
వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వైద్యానికి ఎన్ని వేల కోట్లయినా ఖర్చు పెడతానని శాసనసభ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో మాస్క్ లను కూడా పంపిణీ చేయడం లేదని ఇల్లందు నియోజక వర్గ నాయకులు డాక్టర్ రవి విమర్శించారు.
ఇదీ చదవండి:భూ ఆక్రమణలకు చైనా క్యాబేజీ వ్యూహం..!