కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ పలుమార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య మానవుడిపై భారం మోపుతుందన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ధర్నా
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ముడి చమురు ధరను తగ్గించాలంటూ డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఇల్లందులో కాంగ్రెస్ నాయకుల ధర్నా
కేంద్ర ప్రభుత్వ విధానాలతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున దశలవారీగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:హోంమంత్రికి కరోనా.. వైద్యాధికారులు ఏమంటున్నారంటే?