Fighting in Marriage: ఆ తండాలో పెళ్లి వేడుక జరుగుతోంది. పెళ్లి కొడుకు తరఫు బంధువులు రాకతో అంతా సందడిగా మారింది. ఇంతలో ఏమైందో తెలియదు కానీ స్థానికులకు పెళ్లి కొడుకు తరఫు బంధువులకు చిన్నపాటి గొడవ మొదలైంది. అలా మొదలైన ఆ గొడవ పెద్దగా మారి కొట్టుకునే స్థాయికి చేరింది. ఈ ఘర్షణలో కొంతమంది పెళ్లి కొడుకు బంధువులకు గాయాలయ్యాయి. ఇంతలో పెళ్లికొడుకు తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తండాకు చేరుకున్నారు.
ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని ఎస్సై తన వాహనం తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వారిని తన వాహనంలోకి ఎక్కిస్తుండగా... ఏకంగా ఎస్సైపైనే దాడికి యత్నించారు తండా వాసులు. వారిని ఎదిరించి కానిస్టేబుళ్ల సాయంతో గాయపడిన వారిని ఎస్సై అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. తండాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.