తెలంగాణ

telangana

ETV Bharat / state

బీటీపీఎస్‌ రెండో యూనిట్‌ సింక్రనైజేషన్‌ పూర్తి - భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ తాజా వార్తలు

భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం(బీటీపీఎస్‌) రెండో యూనిట్‌ సింక్రనైజేషన్‌ నిర్వహించారు. హైదరాబాద్‌లోని విద్యుత్తు సౌధ నుంచి విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్విచ్‌ ఆన్‌ చేసి దీనిని ప్రారంభించారు. ఉత్పత్తి అయిన 50మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానించారు.

Completion of second unit synchronisation in BTPS
బీటీపీఎస్‌ రెండో యూనిట్‌ సింక్రనైజేషన్‌ పూర్తి

By

Published : Jul 4, 2020, 1:58 PM IST

భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం(బీటీపీఎస్‌) రెండో యూనిట్‌ సింక్రనైజేషన్‌ని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి స్విచ్​ ఆన్​ చేసి ప్రారంభించారు. కొవిడ్‌-19ని లెక్క చేయకుండా సింక్రనైజేషన్‌ విజయవంతానికి కృషి చేసిన అధికారులు, ఇంజినీర్లు, సిబ్బందిని అభినందించారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లిపోయిన నిర్మాణ కార్మికులను తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మిగిలిన యూనిట్ల పనులు త్వరలోనే పూర్తి చేయాలన్నారు. రెండో యూనిట్‌ సింక్రనైజేషన్‌ పూర్తవడంపై జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అధికారులకు, ఇంజినీర్లకు అభినందనలు తెలిపారు.

బీటీపీఎస్‌ రెండో యూనిట్‌ సీవోడీ(కమర్షియల్‌ అపరేషన్‌ డే)ని ఆగస్టులో నిర్వహిస్తామని జెన్‌కో డైరెక్టర్‌(ప్రాజెక్ట్స్‌) సచ్చిదానందం తెలిపారు. సింక్రనైజేషన్‌ని ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు.డిసెంబరులో మూడో యూనిట్‌ సీవోడీ, నాలుగో యూనిట్ సింక్రనైజేషన్‌ చేసేలా ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details