తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణిలో కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ - జనరల్ మేనేజర్ సత్యనారాయణ

అనారోగ్య కారణాలతో ఉద్యోగ విరమణ పొంది ఎన్నో ఏళ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ ఫలించింది. ఆయా కార్మికుల కుటుంబాలకు ఇవాళ నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

compassionte recruitment orders
సింగరేణిలో కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ

By

Published : May 24, 2020, 5:59 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియాలో అనారోగ్య కారణాల వల్ల అన్​ఫిట్ అయిన కార్మికుల వారసులకు జనరల్ మేనేజర్ సత్యనారాయణ ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. సింగరేణి ఇల్లందు ఏరియాలో మొత్తం 106 మంది ఇప్పటి వరకు కారుణ్య నియామకాల కోసం దరఖాస్తులు చేసుకోగా ఇప్పటివరకు 96 మందికి వివిధ ప్రాంతాల్లో నియామక పత్రాలను అందజేసినట్లు తెలిపారు.

ఇప్పుడు నియామక పత్రాలు పొందినవారు శ్రీరాంపూర్ ఏరియా భూగర్భ గనుల్లో పనిచేయుటకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'

ABOUT THE AUTHOR

...view details