తెలంగాణ

telangana

ETV Bharat / state

ధరణి సర్వేలో అలసత్వం... ఇల్లందు అధికారులపై కలెక్టర్​ ఆగ్రహం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయేతర ఆస్తుల సర్వేలో అలసత్వం కనపరుస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

By

Published : Oct 7, 2020, 8:39 PM IST

collector sudden visit at yellandu  in bhadradri kothagudem
ధరణి సర్వేలో అలసత్వం... ఇల్లందు అధికారులపై కలెక్టర్​ ఆగ్రహం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయేతర సర్వే కార్యక్రమాన్ని పరిశీలించి పంచాయితీల్లో వివరాలను సేకరించి.. ఇంటి యజమానులతో మాట్లాడారు. సర్వేలో ఇల్లందు మండలం తక్కువ శాతం చూపించడం పట్ల మండల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇల్లందు పట్టణంలో హరితహారం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సర్వే తీరుపట్ల పట్టణంలోని 24 వార్డుల్లో 30 టీములు ఏర్పాటు చేశామని ప్రతిరోజు 70 ఇళ్లను సర్వే చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు కలెక్టర్​కు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రమాకాంత్, డీఆర్డీఓ మధుసూదనరాజు, పురపాలక ఛైర్మన్ వెంకటేశ్వర్లు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో అప్పారావు, అరుణ్, తహసీల్దార్ మస్తాన్ రావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'సొంత అవసరాలకు బ్యాంకు డబ్బు వాడుకున్న నిందితులు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details