గత కొద్ది రోజులుగా పడుతున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయంలోని గేట్లను ఎత్తి భారీగా నీరు విడుదల చేశారు. రెండు రోజులుగా వర్షం తీవ్రత తగ్గగా.. కేవలం రెండు గంటల మాత్రమే తెరిచారు. తాజాగా భారీ వర్షం కురుస్తున్నందున.. రిజర్వాయర్లోకి పెద్దమొత్తంలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు 12 గేట్లను తెరిచేందుకు నిర్ణయించారు.
కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. ఇక్కట్లలో లోతట్టు ప్రజలు - కిన్నెరసాని జలాశయం నుంచి 12 గేట్లు ఎత్తివేత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీని వల్ల ప్రాజెక్టులోని 12 గేట్లను అధికారులు తెరిచారు. అన్నింటిని ఒకేసారి వదలగా.. సమీప లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బంది పడ్డారు.

కిన్నెరసాని జలాశయం నుంచి 12 గేట్లు ఎత్తివేత
కిన్నెరసాని జలాశయంలో ఒక్కసారిగా గేట్లు తెరవగా.. వరద నీరు లోతట్టు ప్రాంతాలకు భారీగా పొంగిపొర్లింది. దీనివల్ల లోతట్టు గ్రామప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. యానం బయలు, కిన్నెరసాని గ్రామస్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వరద నీటికి తమ ఇళ్లు దెబ్బతిన్నాయని.. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వాపోయారు.