భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో జరగాల్సిన వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఓటు వేయడానికి తక్కువ మంది ఓటర్లు రావడం వల్ల అధికారులు ఎన్నికలను వాయిదా వేశారు.
భద్రాచలంలో వాయిదా పడిన సహకార ఎన్నికలు
భద్రాచలంలో జరగాల్సిన సహకార సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఓటు వేయడానికి 1/3వ వంతు మంది ఓటర్లు కూడా రాకపోవడమే ఇందుకు కారణం.
భద్రాచలంలో వాయిదా పడిన సహకార ఎన్నికలు
భద్రాచలంలో 40 మంది ఓటర్లు మాత్రమే ఉండటం వల్ల చేతులు ఎత్తి అభ్యర్థులను ఎన్నుకునే విధంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 40 మంది ఓటర్లలో 20 మంది మాత్రమే ఓటు వేసేందుకు హాజరయ్యారు. 1/3వ వంతు (27 మంది ఓటర్లు) ఉంటేనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. 20 మంది ఓటర్లే రావడం వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి.