భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు, ఏన్కూరు మండలాలకు చెందిన 11 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాములునాయక్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ వెంకట్రెడ్డి, ఎంపీపీ, మార్కెట్ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
'కేసీఆర్ సంక్షేమ పథకాలతో పేదలకు కొండంత అండ' - సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే రాములునాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాములు నాయక్ సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో బలహీన వర్గాలకు కొండంత అండ లభించిందని చెప్పారు.
సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే రాములునాయక్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. సంక్షేమ పథకాలతో పాటు ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధితో అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో బలహీన వర్గాలకు తెరాస ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి:హైదరాబాద్కు 200 టన్నుల అమోనియం నైట్రేట్!