భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామం వద్ద చేపట్టిన సీతమ్మ సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు కాపర్ డ్యాం కాంక్రీట్ పనులు ఈ నెలాఖరులోగా ప్రారంభించాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్... జనవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా మణుగూరు చేరుకున్న స్మితాసబర్వాల్ సింగరేణి విశ్రాంత భవనంలో జలవనరుల ఇంజినీరింగ్ అధికారులు, ఎల్ అండ్ టీ ఏజెన్సీలతో సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.