Gulabi Dosa : సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్వహిస్తున్నారు. అన్నదానాలు, రక్తదానాలు, రోగులకు పండ్ల పంపిణీలు చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో తెరాస కార్యకర్తలు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Gulabi Dosa : రూపాయికే గులాబీ దోశ.. స్పెషల్ ఏంటంటే.. - భద్రాద్రి కొత్తగూడెం వార్తలు
Gulabi Dosa : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో తెరాస కార్యకర్తలు వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. గులాబీ రంగులో దోశలు చేయించడమే కాకుండా ఒక్కో దోశను రూపాయిచొప్పున విక్రయించారు.
Rose Dosa
బీట్రూట్తో దోశలను గులాబీ రంగులో తయారుచేయడమే కాకుండా ఒక్కో దోశను రూపాయి చొప్పున విక్రయించారు. వినూత్నంగా ఉన్న దోశలు రూపాయికే లభించడంతో ప్రజలు దోశల కోసం ఎగబడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదీ చూడండి :CM KCR Birthday Wishes: జన్మదిన శుభాకాంక్షలతో.. ఒడిశాలో కేసీఆర్ భారీ సైకత శిల్పం..