కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి వెచ్చించిన ఖర్చుపై ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కొత్తగూడెంలో డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని భట్టి తెలిపారు. నిర్మాణ వ్యయం మొదలుకొని వెచ్చించిన ఖర్చు సద్వినియోగం అయ్యే దాకా అనేక అంశాలను ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించారు.
'కాళేశ్వరం నిర్మాణ ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి'
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలకు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
'కాళేశ్వరం నిర్మాణ ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి'
నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలకు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా నిర్మాణ వ్యయాన్ని పెంచడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రజలను తాకట్టు పెట్టి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఎన్ని వేల ఎకరాలకు నీరు అందిస్తుందో ప్రభుత్వం తెలియ చేయాల్సిన అవసరం ఉందన్నారు.