Bhatti on Kaleshwaram: ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిన రూ.లక్షల కోట్లు వరదలో కొట్టుకుపోయాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రాజెక్టులు, ముంపు ప్రాంతాలు సందర్శించకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని భట్టి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అణచివేత చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తామని స్పష్టం చేశారు.
Bhatti fire on trs ప్రజలను కలవకుండా సీఎల్పీ బృందాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. వరద ముంపు ప్రాంతాల్లో నష్టాలను ప్రభుత్వం అంచనా వేయలేదని భట్టి ఆరోపించారు. టెర్రరిస్టుల మాదిరిగా ఇల్లందు గెస్ట్‌హౌస్‌లో తమను బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాన్ని అణచివేసేందుకే పోలీసులను ప్రభుత్వం వాడుకుంటుందని భట్టి విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యక్రమం ఆగేది లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
భూపాలపల్లిలో అడ్డుకున్న పోలీసులు:కాళేశ్వరం సందర్శనకు వెళ్తున్న సీఎల్పీ నేతలను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతల్ని భూపాలపల్లిలో నిలువరించారు. సందర్శనకు అనుమతి లేదని డీఎస్పీ రాములు వారికి వివరించారు. డీఎస్పీ రాములు తీరుపై భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.