కరోనా విజృంభిస్తోన్న సమయంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో 50 శాతం కంటే తక్కువ మంది సిబ్బంది పని చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పొదెం వీరయ్య. ములుగు ఎమ్మెల్యే సీతక్క సందర్శించారు. ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డును పీపీకిట్లు ధరించి పరిశీలించారు.
'భద్రాచలం ఆసుపత్రిలో 50 శాతం కంటే తక్కువ వైద్యసిబ్బంది' - congress leaders visited badrachalam hospiral
భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పొదెం వీరయ్య. ములుగు ఎమ్మెల్యే సీతక్క సందర్శించారు. ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డును పీపీకిట్లు ధరించి పరిశీలించారు. బాధితులు ఎక్కువగా ఉన్నప్పటికీ కేవలం 13 మంది వైద్యులే ఉన్నారని భట్టి తెలిపారు.
బాధితులు ఎక్కువగా ఉన్నప్పటికీ కేవలం 13 మంది వైద్యులే ఉన్నారని భట్టి తెలిపారు. పట్టణంలో 400 మంది కరోనా బారిన పడ్డారని సుమారు 600 మంది హోంక్వారంటైన్లో ఉంటున్నారని భట్టి వివరించారు. ప్రతీ ఆసుపత్రికి హోంక్వారంటైన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచించినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని దుయ్యబట్టారు. కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం సూపరింటిండెంట్పై అధిక భారం పడిందన్నారు. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న సిబ్బంది నియామకాలను వెంటనే పూర్తి చేసి... ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.