తెలంగాణ

telangana

ETV Bharat / state

'పట్నం ఉపాధి లేదంది... కన్న ఊరు కాదు పొమ్మంది' - badradhri kothagudem district

కన్నతల్లి లాంటి ఊరే పొమ్మంది. అనురాగాలు, ఆప్యాయతల కలబోతగా ఉండే గ్రామస్థులే గ్రామ పొలిమేరల్లోకి వారిని అడుగుపెట్టొద్దంటూ వెళ్లగొట్టారు. బాధ్యతగా ఉంటూ భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కూడా స్పందించలేదు. వారి దయనీయ స్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప బంధువులు కూడా ఏమీ చేయలేకపోయారు. కరోనా మహమ్మారి పుణ్యమా అని మాయమైన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఈ సంఘటన.

'పట్నం ఉపాధి లేదంది... కన్న ఊరు కాదు పొమ్మంది'
'పట్నం ఉపాధి లేదంది... కన్న ఊరు కాదు పొమ్మంది'

By

Published : May 10, 2020, 7:23 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ కుటుంబానికి సొంత ఊరు ఆదరణ కరవైంది. పొట్టకూటి కోసం పట్నం వెళ్లి బతుకీడుస్తున్న కుటుంబం... కరోనాతో లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయింది. ఈ క్రమంలో సొంతూరులోనే కూలో నాలో చేసుకుని కళో గంజో తిని బతుకుదామని కొండంత ఆశతో స్వగ్రామానికి వస్తే గ్రామస్థులు కాదు పొమ్మంటున్నారు. ఇల్లందు మండలం కొమరారం గ్రామానికి చెందిన వీరిని గ్రామంలోకి రావొద్దని గ్రామస్థులు హెచ్చరించారు.

దేవాలయమే ఆవాసం...

ఈ క్రమంలో ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న దేవాలయమే వారికి నివాసంగా మారింది. హైదరాబాద్ నుంచి వందల కిలోమీటర్లు నడకయాతనతో ఉన్న ఊరికి చేరుకున్న ఆ కుటుంబాన్ని అంతా కలిసి గెంటేశారని కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం దయనీయ పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రతినిధి లింగయ్య అందించిన కథనం.

'పట్నం ఉపాధి లేదంది... కన్న ఊరు కాదు పొమ్మంది'

ఇవీ చూడండి : దేశంలో ఒక్కరోజే మరో 128 కరోనా మరణాలు

ABOUT THE AUTHOR

...view details