భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో రైతు బానోత్ హన్మ వైరస్ బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మం ఆస్పత్రి నుంచి హైదరాబాదులో చేర్చారు. 15 రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. కొన్నాళ్ల పాటు ఇంటి వద్ద ఆక్సిజన్ సదుపాయం ఉండాలని వైద్యులు సూచించారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఖమ్మం జిల్లా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకెళ్లగా... వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
'చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు రుణపడి ఉంటాం' - తెలంగాణ వార్తలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో కరోనా బారిన పడిన రైతుకు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. ఇంటివద్ద ఆక్సిజన్ సదుపాయం అవసరం కాగా... సమకూర్చింది. చిరంజీవి ట్రస్ట్‌కు తాము రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్, కరోనా
ఇంటివద్ద ఆక్సిజన్ సౌకర్యాన్ని కల్పించారని వెల్లడించారు. ఇటీవల పూర్తయిన ఆక్సిజన్ పరికరం స్థానంలో మరో ఆక్సిజన్ పరికరాన్ని ఎటువంటి ఖర్చు లేకుండా అమర్చారని వివరించారు. చిరంజీవి ట్రస్ట్‌కు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:Third Wave: 'పిల్లలకు ముప్పు'పై ఆధారాల్లేవు!