భద్రాద్రి సీతారామ కల్యాణానికి అక్కడి తలంబ్రాలు - Bhadradri temple news
bhadradri sitaramula kalyanam : భద్రాద్రిలో అంగరంగ వైభవంగా జరగబోయే సీతారామ కల్యాణానికి గోటితో ఒలిచిన తలంబ్రాలు సిద్ధమయ్యాయి. సుమారు ఏడు సంవత్సరాలుగా బాపట్ల జిల్లా చీరాల నుంచి ఈ తలంబ్రాలను పంపిస్తున్నారు.
bhadradri sitaramula kalyanam : భద్రాద్రి సీతారామ కల్యాణానికి బాపట్ల జిల్లా చీరాల నుంచి ఆఖరి విడతగా తలంబ్రాలు తరలివెళ్లాయి. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో కన్నుల పండువగా నిర్వహించే సీతారాముల కల్యాణానికి ఏటా చీరాల నుంచే గోటితో ఒలిచిన తలంబ్రాలను పంపిస్తూ వస్తున్నారు. వరుసగా ఎనిమిదోసారి ఈ అవకాశాన్ని చీరాల రఘురామభక్త సమాజం దక్కించుకుంది. గత ఐదు నెలలుగా, సుమారు 7 వేల మంది భక్తులు నియమనిష్ఠలతో గోటితో ఒడ్లను ఒలిచి.. క్వింటా 54 కిలోల బియ్యాన్ని విడతల వారీగా భద్రాచలం పంపించారు. ఆఖరివిడతగా పసుపు, కుంకుమ కలిపిన తలంబ్రాలను.. భద్రాచలానికి తీసుకెళ్లారు. తలంబ్రాల్లో కలిపే పసుపును.. మహిళల స్వయంగా రోకళ్లతో దంచి తయారుచేశారు.