తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ ఏడాది చివరి వరకు కరోనా ఉంటుంది: చినజీయర్‌ - Bhadradri news

సీతారామచంద్ర స్వామిని చినజీయర్‌ స్వామి దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది చివరి వరకు కరోనా ఉంటుందని చినజీయర్​ స్వామిజీ తెలిపారు.

Chinzier swamiji
ఈ ఏడాది చివరి వరకు కరోనా ఉంటుంది: చినజీయర్‌

By

Published : Sep 4, 2020, 12:57 PM IST

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి... అహోబిల రామానుజ స్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన ఆయనకు అర్చకులు, పండితులు ఘన స్వాగతం పలికారు.

ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చినజీయర్‌ స్వామి.... అభయాంజనేయ స్వామి, లక్ష్మీ తయారు అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. 60 రోజుల పాటు చాతుర్మాస్య వ్రతం పూర్తిచేసుకుని భద్రాద్రి రామయ్య సన్నిధికి వచ్చినట్లు చినజీయర్‌ స్వామి తెలిపారు. వచ్చే ఆశ్వాయుజ మాసం నుంచి కార్తీక మాసం వరకు 30 రోజులపాటు ప్రత్యేక రామ క్రతువు కోసం రామయ్య ఆశీస్సులు తీసుకున్నామని తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు కరోనా ఉంటుందని చినజీయర్​ స్వామిజీ చెప్పారు.

ఇదీ చదవండి:ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ కరోనా పరీక్షలు..!

ABOUT THE AUTHOR

...view details