భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు గురువారం రాత్రి చిన్నజీయర్ స్వామి, అహోబిల రామానుజ స్వామితో కలిసి భద్రాచలం చేరుకున్నారు. భద్రాచలం వచ్చిన స్వామికి భద్రాద్రి ఆలయ అర్చకులు, వేద పండితులు బ్రిడ్జి సెంటర్ వద్ద ఘనస్వాగతం పలికారు. అనంతరం రాజ వీధిలో జీయర్ మఠం వద్ద స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితులు వేదమంత్రాలు చదువుతుండగా మహిళా భక్తులు స్వామివారికి హారతి అందించారు.
భద్రాద్రి రామయ్య సన్నిధికి చినజీయర్ స్వామి - భద్రాచలం
చినజీయర్ స్వామి అహోబిల రామానుజ స్వామితో కలిసి గురువారం రాత్రి భద్రాచలం చేరుకున్నారు. ఇవాళ రాముల వారిని దర్శించుకుని పూజలు చేయనున్నారు.
SWAMI
ఇవాళ జీయర్ మఠంలో పూజలు నిర్వహించిన అనంతరం స్వామి వారు భక్తులకు తీర్థగోష్టి అందించనున్నారు అనంతరం భద్రాద్రి రామయ్యను దర్శించుకుంటారు. దర్శనానంతరం కొద్ది రోజుల క్రితం స్వర్గస్తులైన మాజీ ప్రధాన అర్చకులు కోటి కృష్ణమాచార్యులు చిత్రపటానికి నివాళులర్పించనున్నారు. దీంతోపాటు భద్రాచలం జీయర్ మఠం అధ్యక్షులు బట్టర్ చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు.
ఇవీ చూడండి: 'ఊరికి మొనగాళ్లు' పేరిట కథనం... స్పందించిన ప్రభుత్వం